పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా 35వ డివిజన్ పొదలకూరు రోడ్డు లేక్‌వ్యూ కాలనీ మొదటి వీధి ప్రాంతంలో బుధవారం పర్యటించారు. నూతనంగా నిర్మించిన డ్రైన్ కాలువల పనుల నాణ్యతను పరిశీలించారు. కేవీఆర్ పెట్రోల్ బంకు రోడ్డుకు అనుసంధానంగా నూతనంగా నిర్మించిన డ్రైన్ కాలువల నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చేశారు.