క్రిస్మస్ అంటే ప్రేమ, శాంతికి ప్రతీక: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
E.G: రాజమండ్రి 40వ డివిజన్ సీతంపేట మూలగొయ్యి ప్రాంతంలో మంగళవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ కేవలం పండుగ మాత్రమే కాదని, అది ప్రేమ, శాంతి, ఆశలకు ప్రతీక అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.