నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ
MHBD: నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కేంద్రాలను డీఎస్పీ తిరుపతిరావు శుక్రవారం పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం సీఐ సత్యనారాయణ, నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.