థియేటర్ యజమానులు విధిగా నిబంధనలు పాటించాలి

VZM: థియేటర్ యజమానులు విధిగా నిబంధనలు పాటించాలని తహసీల్దార్ సుదర్శనరావు ఆదేశించారు. డీఆర్‌వో ఆదేశాల మేరకు నెల్లిమర్ల పట్టణంలోని సినిమా థియేటర్‌ని శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు థియేటర్‌లో ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుధ్యం సక్రమంగా ఉండాలని చెప్పారు.