ఆర్డీవో కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా
AKP: నర్సీపట్నం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం తమ సమస్యల పైన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.