కొత్తూరులో రైతన్న మీకోసం కార్యక్రమం
SKLM: కొత్తూరు మండల కేంద్రంలో 'రైతన్న మీ కోసం' కార్యక్రమాన్ని లోతుగెడ్డ తులసీ వర ప్రసాద్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించాలని రైతులకు సూచించారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. APAIMS 2.0 యాప్ ద్వారా పంటల వివరాలు, మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.