మోపిదేవి ఆలయానికి కియోస్క మిషన్లు
కృష్ణా: జిల్లా మండలకేంద్రమైన మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయానికి కరూర్ వైశ్య బ్యాంకు ఆధ్వర్యంలో కియోస్క మిషన్లను అందజేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు, దేవస్థానానికి సంబంధించిన సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు ఈ మిషన్లను ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందజేశారు.