జాతీయ స్థాయిలో విద్యార్థి ప్రతిభ

జాతీయ స్థాయిలో విద్యార్థి ప్రతిభ

JGL: కండ్లపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థి ఎదుల రిత్విక్ జాతీయ స్థాయి స్కాలర్షిప్ పరీక్షలో సత్తా చాటాడు. "గురుషాల" క్విజ్ పోటీల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికై రూ.25,000 స్కాలర్షిప్‌ను సాధించాడు. పాఠశాల ప్రిన్సిపల్ సరితా దేవి, వైస్ ప్రిన్సిపల్ కె. నాగేశ్, ఉపాధ్యాయులు రిత్విక్‌ను అభినందించారు.