చింతలపూడి అభివృద్ధిపై సీఎంకు ఎమ్మెల్యే వినతి

ELR: చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలతో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. రహదారుల మెరుగుదల, చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాలకు సౌర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై చర్చించారు. సానుకూలంగా స్పందించారని బుధవారం రోషన్ కుమార్ మీడియాకు వెల్లడించారు.