'హైకోర్టు ఆదేశించడం ద్వారా న్యాయంగెలిచింది'
NZB: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం ద్వారా న్యాయం గెలిచిందని NZB అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేలిందన్నారు.