సహజ వ్యవసాయంపై కలెక్టర్ సూచనలు
KRNL: భూసారాన్ని పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రైతులు సహజ వ్యవసాయం చేపట్టాలని కలెక్టర్ సిరి సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సహజ వ్యవసాయంపై జిల్లా స్థాయి శిక్షణ నిర్వహించారు. పీఎండీఎస్ (Pre-Monsoon Dry Sowing), పచ్చి ఎరువుల సాగు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవగాహన కల్పించి ఈ విధానాలు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.