ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రైతుల ఆందోళన
SRCL: పంట పొలాలకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ వేములవాడ మండలం మారుపాక గ్రామంలో శనివారం రైతులు ఆందోళన చేశారు. విద్యుత్ కొరత పై గ్రామంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమ పొలాలకు నీరు సరఫరా అయ్యేందుకు సరిపడా కరెంటు సరఫరా చేయాలని కోరారు. ఈ మేరకు సెస్ ఏఈకి రైతులు వినతి పత్రం అందజేశారు.