విద్యాహక్కు చట్టం ప్రవేశాలకు గడుపు పొడిగింపు: డీఈవో

గుంటూరు: విద్యాహక్కు చట్టం 2009 ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లలో ఉచితంగా ప్రవేశం పొందటానికి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల-31 వరకు పొడిగించినట్లు గుంటూరు జిల్లా అధికారి డీఈవో శైలజ సోమవారం తెలిపారు. అధిక సంఖ్యలో విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువును పొడిగించారు.