VIDEO: వడ్ల సంచుల కొరతపై రైతుల రాస్తారోకో

MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లి వద్ద జాతీయ రహదారి 167పై రైతులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. వడ్లకు సంచులు లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఇది అంతర్రాష్ట్ర రోడ్డు కావడంతో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.