పుంగనూరులో 10 మందిపై పిచ్చి కుక్క దాడి
CTR: పుంగనూరులో శుక్రవారం రాత్రి పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. ఒకేసారి 10 మందిపై దాడి చేసి గాయపరిచింది. ఈ దాడిలో ముగ్గురు త్రీవంగా గాయపడడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడులు పాల్పడుతున్నాయని స్థానికులు చెప్పారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.