ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపు.. 5% రాయితీ పొందిన కౌన్సిలర్
KNR: హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను ఏప్రిల్ నెలాఖరులోపు ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం కల్పిస్తున్న 5 శాతం రాయితీని 20వ వార్డు కౌన్సిలర్ దామెర అనూష సద్వినియోగం చేసుకున్నారు. ఆమె రూ.25,176 పన్నును ముందస్తుగా చెల్లించారు. అనంతరం అధికారులతో కలిసి 7, 14, 21, 24 వార్డుల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.