ఇంటర్ పరీక్షకు 383 మంది గైర్హాజరు

ఇంటర్ పరీక్షకు 383 మంది గైర్హాజరు

AKP: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 383 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,375 మంది హాజరు కావలసి ఉండగా 8,992 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.