బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష
KMR: బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు ఇవాళ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామంలో పాఠశాలలకు సెలవు ఉండటంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను అదే గ్రామానికి చెందిన జల్దేవార్ శ్రీనివాస్ అత్యాచార యత్నం చేసినట్లు తెలిపారు.