సాత్నాల ప్రాజెక్ట్ తాజా వివరాలు

ADB: సాత్నాల ప్రాజెక్టు వివరాలను అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వస్తోందన్నారు. దీంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 284.90 అడుగులుగా ఉందన్నారు. 90 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని తెలిపారు.