VIDEO: విద్యార్థులకు లైఫ్ జాకెట్లు అందజేసిన మంత్రి

VIDEO: విద్యార్థులకు లైఫ్ జాకెట్లు అందజేసిన మంత్రి

కోనసీమ: గోదావరిలో వరద పెరుగుతున్నందున పీ.గన్నవరం మండలం అయోధ్యలంక వద్ద లంకల గన్నవరం జడ్పీ హైస్కూల్లో చదివే విద్యార్థులు పడవలు మీద పాఠశాలకు వెళ్తారు. వారికి మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ లైఫ్ జాకెట్లు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. రాకపోకల సమయంలో తప్పనిసరిగా వాటిని ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.