నెల్లూరులో కమిషనర్ వినూత్న ఆలోచన

నెల్లూరులో కమిషనర్ వినూత్న ఆలోచన

NLR: నగరంలో రోడ్ల పక్కన, డివైడర్ల మధ్యలో నీటితొట్లు ఏర్పాటు చేస్తున్నారు. తీవ్రమైన వేసవిని దృష్టిలో ఉంచుకొని పశువులు, పక్షుల దాహం తీర్చేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ నందన్ తెలిపారు. నగరంలోని మహాత్మాగాంధీనగర్, జర్నలిస్ట్ కాలనీ, ట్రంక్ రోడ్డు ప్రాంతాల్లో ప్రస్తుతానికి నీటి తొట్లు ఏర్పాటు చేశారు.