రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో విద్యుత్ అభివృద్ధి పనుల దృష్ట్యా రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ సురేందర్ తెలిపారు. మదనపల్లె-తంబళ్లపల్లె రోడ్డులో విద్యుత్ లైన్ల నిర్వహణ, HDSS నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు కారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు సహకరించాలని కోరారు.