బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

KDP: పెండ్లిమర్రి మండలంలోని కొత్త గంగిరెడ్డిపల్లిలో 16 ఏళ్ల బాలికకు 26 ఏళ్ల యువకుడితో 2 రోజుల్లో వివాహం జరుగుతుందన్న సమాచారం రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎస్సై మధుసూదన్ రెడ్డి గ్రామానికి చేరుకుని ఇరు కుటుంబాల పెద్దలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ మేరకు పెండ్లిమర్రి తహసిల్దార్ బైండోవర్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.