నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ADB: కుంటాల మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిస్కం ఏఈ మధు ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని దౌనెల్లి, వెంకూర్, రాజాపూర్ గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.