'ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి'
HNK: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ ) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ పురోగతిపై కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.