గ్రెటా థన్‌బర్గ్ ప్రయాణిస్తున్న నౌకపై డ్రోన్ దాడి

గాజాలో మానవతాసాయం అందించేందుకు పర్యావరణ ఉద్యమకారిణి గెట్రా థన్‌బర్గ్ ప్రయాణిస్తున్న నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఆ నౌకలో ఆమెతో పాటు 44 దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్లు సమాచారం. ట్యునీషియా తీరం వద్ద జరిగిన ఈ దాడిలో నౌకలోని సిబ్బంది, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ సముద్ ఫ్లోటిల్లా సంస్థ కూడా ఈ దాడిని ధ్రువీకరించింది.