'యార్డ్‌లో మధ్యాహ్న భోజనం ప్రారంభం'
ADB: పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చే రైతుల కోసం రూ.10కే భోజన వసతి కల్పిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మార్కెట్ యార్డ్‌లో ఇస్కాన్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ ఛైర్మన్ అడ్డి బోజారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం వారు రైతులతో కలిసి భోజనం చేశారు.