మెగా డ్రిప్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన మంత్రి
ATP: కూడేరు మండలం జయపురం గ్రామ సమీపంలో మధ్యలోనే ఆగిపోయిన మెగా డ్రిప్ ఇరిగేషన్ పంప్ హౌస్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఈ ప్రాజెక్టును, వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందని ఆయన మండిపడ్డారు. రైతులకు మేలు చేసే ఆలోచన గత ప్రభుత్వానికి లేదని విమర్శించారు.