విజయవాడ శివారులో దారుణ హత్య.?

విజయవాడ న్యూ ఆటోనగర్ వివాన్ వద్ద దారుణ హత్య జరిగింది. ఎనికేపాడుకి చెందిన సుబ్బారావు అలియాస్ కేబుల్ నాని(45)ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి సుబ్బారావు బయటకు వచ్చాడు. నేడు విగతజీవిగా డ్రైనేజీ కాలువలో శవమై తేలాడు. సుబ్బారావు ఒంటిపై కత్తి ఘాట్లు ఉండడంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు.