సంజీవయ్యకు నివాళులర్పించిన కలెక్టర్

CTR: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ సుమిత్ కుమార్ నివాళులర్పించారు. జిల్లా సచివాలయంలో పాత గ్రీవెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, అధికారులు పాల్గొన్నారు.