'సత్యసాయి ప్రత్యేక స్థానం సాధించారు'
SRCL: కోట్లాది భక్తుల హృదయాలలో శ్రీ సత్య సాయి బాబా ప్రత్యేక స్థానం సాధించారని బెటాలియన్ కమాండెడ్ సురేష్ అన్నారు. సత్య సాయి జయంతి సందర్భంగా సిరిసిల్లలోని బెటాలియన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. పుట్టపర్తి సాయిబాబా మానవ కళ్యాణం కోసం తన జీవితాన్నే త్యాగం చేశారని గుర్తు చేశారు.