‘క్రెడిట్’ పెంపు మోసాలతో జాగ్రత్త: TG పోలీస్
TG: క్రెడిట్ కార్డ్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులను పోలీస్ శాఖ అప్రమత్తం చేసింది. క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ ఎవరైనా కాల్ చేసి OTP అడిగితే చెప్పొద్దని హెచ్చరించింది. తెలియని లింకులపై క్లిక్ చేయడం, కార్డ్ వివరాలను ఇతరులకు చెప్పడం వంటివి చేయొద్దని సూచించింది. కస్టమర్ కేర్ ప్రతినిధులు కార్డ్ వివరాలు అడగరని స్పష్టం చేసింది