బియ్యం బదులు మూడు కిలోల రాగులు పంపిణీ
AKP: జిల్లాలోని రేషన్ కార్డుదారులకు రేపటి నుంచి డిసెంబర్ నెల కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులు పంపిణీ చేయనున్నట్టుగా జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.