శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో సందడి చేసిన మంత్రి సుభాష్

KKD: కాజులూరు మండలం గొల్లపాలెంలో శనివారం జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. శ్రీకృష్ణ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో మంత్రి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ప్రజలందరికీ ఇష్టమైన కృష్ణాష్టమి పండుగ ఘనంగా నిర్వహించడం ఆనందకరమని ఆయన అన్నారు.