సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: ఉంగుటూరు మండలంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. గురువారం రాత్రి మండలంలోని మానికొండలో రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన 750 మీటర్ల సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించి, ప్రజలతో మమేకమయ్యారు. సమస్యలు తెలుసుకొని, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.