పండగ వేళ ఆలయంలో విషాదం

పండగ వేళ ఆలయంలో విషాదం

పండగ వేళ కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. ఆలయం కోనేరులో పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఉగాది సందర్భంగా నిశ్చితార్థమైన యువతి బంధువులతో ప్రశాంత్‌ అనే వ్యక్తి ఆలయానికి వచ్చాడు. ఈ క్రమంలో స్నానం చేయడానికి కోనేరులో దిగి ప్రమాదవశాత్తు మరణించాడు. ప్రశాంత్‌కు నాలుగు రోజుల క్రితం నిశ్చితార్థం జరిగినట్లు బంధువులు చెబుతున్నారు.