ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరికలు
సత్యసాయి: బుకపట్నం మండలం యర్లంపల్లి గ్రామానికి చెందిన 36 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో వారు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారంతా పేర్కొన్నారు.