జంపన్న వాగులో ఓ వ్యక్తి గల్లంతు

MLG: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగులో జనగామ జిల్లా కు చెందిన ఓ వ్యక్తి గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి మేడారం వచ్చిన యువకుడు వాగులో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వ్యక్తిని వెతుకుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.