ఈనెల 23న అనపర్తిలో మెగా జాబ్ మేళా
E.G: అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 23న మెగా ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉద్యోగ మేళకు సంబంధించి 1200 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.