‘లెదర్ పరిశ్రమను తరలించడం లేదు'

ప్రకాశం: జిల్లా ప్రజలకు లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యాల రావు శుభవార్త చెప్పారు. రాచర్ల మండలం ఎడవల్లి సమీపంలోని లెదర్ పరిశ్రమను ఎక్కడికీ తరలిండం లేదని ప్రకటించారు. మరోవారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పరిశ్రమను వేరే ప్రాంతానికి తరలిస్తారని ఇటీవల వార్తలు రావడంతో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి ఆయన పరిశ్రమను పరిశీలించారు.