భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఆగిన సైరన్లు

భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఆగిన సైరన్లు

భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితిలోకి వచ్చాయి. సరిహద్దుల్లో కాల్పులు, డ్రోన్ల సంచారం, పేలుళ్లు, సైరన్ల మోతలు ఆగాయి. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో కూడా పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయి. దీంతో శ్రీనగర్, అమృత్‌సర్‌తో పాటు పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్‌లో అధికారులు బ్లాక్‌అవుట్ ఎత్తివేశారు.