మాత్రలు పంపిణీ చేసిన వైద్య సిబ్బంది

మాత్రలు పంపిణీ చేసిన వైద్య సిబ్బంది

SKLM: సంతబొమ్మాళి మహాత్మా గాంధీ జ్యోతిబా బీసీ బాయ్స్ పాఠశాలలో మంగళవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ నందిని విద్యార్థులకు తగిన సూచనలు చేశారు. ముఖ్యంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వీటి వినియోగం వలన పొట్టకు సంబంధించిన వ్యాధులు నివారణ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం బీసీహెచ్ లక్ష్మి పాల్గొన్నారు.