ఆర్టీసీ సమ్మెకు ప్రతి ఒక్కరు సిద్ధం కావాలి: JAC ఛైర్మన్
SRD: సమస్యల సాధన కోసం సమ్మెకు ప్రతి ఒక్కరు సిద్ధం కావాలని నారాయణఖేడ్ RTC డిపో కార్మికుల JAC ఛైర్మన్ నెహ్రూ పిలుపునిచ్చారు. మంగళవారం ఖేడ్ డిపో కార్మికులంతా సమావేశమై సమ్మెకు సన్నాహాలు చేశారు. ప్రతి ఒక్క కార్మికుడు కలిసిమెలిసి సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. స్థానిక డిపోలో కార్మికులు అనేక రకాల బాధలు పడుతున్నారని, పరిహారాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు.