చెల్లెలి భర్తను చంపిన అన్న
SS: లేపాక్షిలోని వెంకటాపురంలో నిత్యం చెల్లిలిని అనుమానిస్తూ, వేధిస్తున్నాడని సొంత బావనే బావమరిది హతమార్చిన ఘటన బుధవారం జరిగింది. వెంకటాపురానికి చెందిన మేఘనకు 11 నెలల క్రితం వినయ్ అనే వ్యక్తితో వివాహమైంది. భార్య మేఘనపై వినయ్ అనుమానం పెంచుకుని వేధించేవాడు. విషయం తెలుసుకున్న అన్న రాజు హంద్రీనివా కాలువ వద్ద వినయ్‌ను చంపి కాలువలో పడేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.