పెట్రోల్ బంకుల్లో మోసాలు.. DGP హెచ్చరిక

NLR: ఎలక్ట్రానిక్ చిప్లు టాంపర్ చేసి రాష్ట్రంలోని పలు పెట్రోల్ బంకులు మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని 73 పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసి పలు చోట్ల వాహనాలకు తక్కువ పెట్రోల్, డీజిల్ కొడుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాంమని హెచ్చరించారు.