బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు..!
W.G: విద్యార్థినులను ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమవరం మండలం గొల్లవానితిప్ప ఉన్నత పాఠశాల బాలికలను మ్యాథ్స్ టీచర్ లైంగికంగా వేధించినట్లు తెలియడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా నిర్వహించిన PTMలో తల్లిదండ్రులు అధికారులకు వివరించారు. దీంతో అధికారులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.