కేజీహెచ్‌లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు
AP: విశాఖ కేజీహెచ్‌లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ పనుల దృష్ట్యా విద్యుత్ తీగలు తెగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని చెప్పారు. జనరేటర్ ద్వారా కొన్ని విభాగాల్లో విద్యుత్ సరఫరా కొనసాగుతుండగా.. పలు విభాగాల్లో మాత్రం కొవ్వొత్తుల వెలుతురులో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.