హసీనా అప్పగింతపై భారత్ స్పందన
భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక విజ్ఞప్తి చేసింది. తమ దేశ మాజీ ప్రధాని హసీనాను తమకు అప్పగించాలని కోరింది. ఈ విజ్ఞప్తిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. బంగ్లా ప్రజలకు మేలు జరిగే రీతిలో తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. కాగా, హసీనాకు ఉరిశిక్ష వేస్తూ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే.