VIDEO: కలెక్టరేట్ వద్ద సీపీఐ నాయకుల ఆందోళన
KRNL: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ నగర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండించారు. పెరిగిన ధరల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రజలపై పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.