జిల్లాలో సాధారణ వర్షపాతం

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సాధారణ వర్షపాతం నమోదయింది. జిల్లాలో అడ్డాకుల మండలంలో అత్యధికంగా 12.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. చిన్నచింతకుంట మండలంలో 0.5 మి.మీ వర్షపాతం నమోదయింది. ఇక, జిల్లా వ్యాప్తంగా మిగతా 14 మండలాలలో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. సోమవారం వాతావరణం సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.